Thamanna: సినిమా కబుర్లు... సంక్షిప్త సమాచారం!

*  'నాలోని స్టార్ ను చూసి కాకుండా నటిని చూసి మాత్రమే నాకు అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటాను..' అంటోంది కథానాయిక తమన్నా. "స్టార్ ఇమేజ్ వచ్చాక అందుకు తగ్గా క్యారెక్టర్లు ఆఫర్ చేస్తుంటారు. అయితే, నేను మాత్రం నాలోని నటిని బయటకు తీసే తరహా క్యారెక్టర్లు చేయాలని చూస్తుంటాను. ఎవరైనా అలాంటి పాత్రలు ఇవ్వకపోతారా? అన్న ఆశతో వుంటాను" అని చెప్పింది.
*  మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ చిత్రం 'సైరా నరసింహారెడ్డి' బోలెడు ప్రత్యేకతలతో తెరకెక్కుతోంది. నటీనటుల నుంచి, సాంకేతిక నిపుణుల వరకు ఎందరో జాతీయ స్థాయి వారిని ఎంపిక చేశారు. ఇక యాక్షన్ కొరియోగ్రాఫర్ గా హాలీవుడ్ స్టంట్ మాస్టర్ టోనీ చింగ్ ను ఎంపిక చేసినట్టు తాజా సమాచారం.
*  కమలహాసన్ నటిస్తున్న 'విశ్వరూపం 2' చిత్రం కోసం మిగిలి వున్న షూటింగును పూర్తి చేసే పనిలో చిత్రం యూనిట్ వుంది. ఈ చిత్రం ఆడియో వేడుకను వచ్చే నెలలో నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. 
Thamanna
chiranjeevi

More Telugu News