vijay devarakonda: 'అర్జున్ రెడ్డి' టిక్కెట్లా .. హాట్ కేకులా?

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'అర్జున్ రెడ్డి సినిమా తెరకెక్కింది. ఈ నెల 25వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదలకి ఒక రోజు ముందు పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నారు. పెయిడ్ ప్రీమియర్స్ వేస్తోన్న అన్ని థియేటర్స్ లోను టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయట. ఇలా బుకింగ్ మొదలు పెట్టడమే ఆలస్యం.. అలా టికెట్స్ అయిపోతున్నాయని అంటున్నారు.

ఇక శుక్రవారం బుకింగ్స్ కూడా ఒక రేంజ్ లో జరుగుతున్నాయని చెబుతున్నారు. షాలిని పాండే కథానాయికగా నటించిన ఈ సినిమా నుంచి ఇటీవల వచ్చిన టీజర్, అనూహ్యమైన స్థాయిలో అందరిలో ఆసక్తిని పెంచింది. దాంతో వీలైనంత త్వరగా ఈ సినిమాను చూసేయాలనే ఉత్సాహాన్ని యూత్ చూపుతోంది. ఈ జోరు చూస్తుంటే... ఈ సినిమా భారీ సక్సెస్ ను నమోదు చేసేదిలా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.    
vijay devarakonda

More Telugu News