manchu manoj: ఇలాంటి సినిమా చేస్తూ చనిపోయినా ఫరవాలేదు : మంచు మనోజ్

ఓ సాధారణమైన సినిమా చేస్తూ చనిపోతే ఎవరూ పెద్దగా పట్టించుకోరని, కానీ 'ఒక్కడు మిగిలాడు' లాంటి సినిమా చేస్తూ చనిపోతే .. ఓ గొప్ప సినిమా చేస్తూ చనిపోయాడనే పేరు ఎప్పటికీ ఉండిపోతుందని మంచు మనోజ్ ఎమోషన్ తో చెప్పాడు. ఈ సినిమా భారీ బడ్జెట్ సినిమా అని చెప్పడం కన్నా .. గొప్ప సినిమా అని చెప్పడమే సరైనదని ఆయన అన్నాడు.

తాను పుట్టి పెరిగింది చెన్నైలో కనుక తనకు శ్రీలంక తమిళుల కష్టాలు తెలుసని, వాళ్లు పడిన బాధలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే తాను ఈ సినిమా చేయడానికి అంగీకరించానని చెప్పాడు. ఈ ఉద్దేశంతోనే ఈ సినిమాను తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నామని అన్నాడు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా, మనోజ్ ఎకౌంట్ లో హిట్ ను జమ చేస్తుందేమో చూడాలి.  
manchu manoj

More Telugu News