: ఈసీ భన్వర్ లాల్ కు షాకిస్తున్న తెలంగాణ సర్కారు.. 'ఇన్ చార్జ్ అలవెన్స్' చెల్లింపుకు నిరాకరణ!

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ఎన్నికల అధికారి భన్వర్ లాల్ కు తెలంగాణ ప్రభుత్వం షాకిస్తోంది. రాష్ట్ర విభజన తరువాత కేంద్ర ప్రభుత్వం ఆయన్ను ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారిగా నియమిస్తూ, తెలంగాణకు ఇన్ చార్జ్ గా నియమించింది. అప్పటి నుంచి ఆయన రెండు రాష్ట్రాలకూ పని చేస్తున్నారు. ఏదైనా విధుల్లో ఉన్న అధికారికి, అదనపు బాధ్యతలు అప్పగిస్తే, వేతనంలో 20 శాతాన్ని ఇన్ చార్జ్ అలవెన్స్ రూపంలో ఇవ్వాల్సి వుంటుంది.

భన్వర్ లాల్ వేతనం నెలకు రూ. 2.25 లక్షలు కాగా, తెలంగాణ సీఈఓగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నందుకు ప్రభుత్వం నెలకు రూ. 45 వేలు చెల్లించాల్సి వుంటుంది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకూ ఆయనకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోగా, ఆ మొత్తం ఇప్పుడు రూ. 16 లక్షలకు పెరిగింది. తన ఇన్ చార్జ్ అలవెన్స్ చెల్లించాలని భన్వర్ లాల్ లేఖ రాయగా, ఆయన తెలంగాణ ఉద్యోగి కాదని, తమ రాష్ట్రానికి చెందిన ఉద్యోగి కాని వారికి అలవెన్స్ లు ఇవ్వలేమని ప్రభుత్వం స్పష్టం చేసింది.

More Telugu News