keerti suresh: 'మహానటి' మూవీలోకి ప్రకాశ్ రాజ్ ఎంట్రీ!

సావిత్రి జీవితచరిత్రను 'మహానటి' పేరుతో దర్శకుడు నాగ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఆ కాలానికి సంబంధించిన ప్రత్యేకమైన సెట్ వేయించి అందులో షూటింగ్ జరుపుతున్నారు. సావిత్రిగా కీర్తి సురేశ్ నటిస్తుండగా .. ఆమె భర్త జెమిని గణేశన్ పాత్రను మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ చేస్తున్నాడు.

 ఈ నేపథ్యంలో ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్ర కోసం ప్రకాశ్ రాజ్ ను తీసుకున్నారనేది తాజా సమాచారం. నిర్మాత చక్రపాణిగారి పాత్రలో ప్రకాశ్ రాజ్ కనిపించనున్నాడు. సావిత్రి కెరియర్ ఆరంభంలో ఆమెలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన వారిలో చక్రపాణిగారు ముఖ్యులు. ఆ పాత్రకి ప్రకాశ్ రాజ్ సరైన న్యాయం చేస్తారనే ఉద్దేశంతో ఆయనను తీసుకున్నారు. ఇక ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రను సమంతా చేస్తున్న సంగతి తెలిసిందే.    

  • Loading...

More Telugu News