: 2012 ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియా నుంచి పోటీచేసి... 2020 ఒలింపిక్స్‌లో ర‌ష్యా నుంచి పోటీ చేయ‌నున్న సైక్లిస్ట్!

ఆస్ట్రేలియాలో జన్మించి 2012 ఒలింపిక్స్‌లో సైక్లింగ్‌లో ర‌జ‌త ప‌త‌కం సాధించి త‌న దేశానికి పేరు తీసుకువ‌చ్చాడు సైక్లిస్ట్ షేన్ పెర్కిన్స్‌. రానున్న 2020 టోక్యో ఒలింపిక్స్‌లో మాత్రం ర‌ష్యా దేశం నుంచి పోటీ పడనున్నాడు. పౌర‌స‌త్వం మార్చుకోవ‌డం ద్వారా ఇది సాధ్య‌మైంది. గ‌తేడాది త‌న‌కు ర‌ష్యా పౌర‌స‌త్వం కావాల‌ని పెర్కిన్స్ ద‌ర‌ఖాస్తు చేసుకున్నాడు.

 అన్ని విచార‌ణ‌లు, అధికారిక లాంఛనాలు పూర్త‌య్యాక పెర్కిన్స్‌కు ర‌ష్యా పౌర‌స‌త్వం అంద‌జేస్తూ అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్, పెర్కిన్స్ ద‌ర‌ఖాస్తుపై ఆమోద ముద్ర వేశారు. దీంతో వ‌చ్చే ఒలింపిక్స్‌లో పెర్కిన్స్ ర‌ష్యా త‌ర‌ఫున పాల్గొన‌నున్నాడు. ఈ సంద‌ర్భంగా పెర్కిన్స్ త‌న‌కు పౌర‌స‌త్వం జారీ చేసిన అధ్య‌క్షుడికి, అది సాధించ‌డంలో స‌హాయం చేసిన ర‌ష్యా సైక్లింగ్ ఫెడ‌రేష‌న్‌కి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశాడు. 2016 రియో ఒలింపిక్స్‌లో పెర్కిన్స్ పాల్గొన‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

More Telugu News