taapsi: తెలుగులో ఇకపై గ్యాప్ ఇవ్వనంటే ఇవ్వను : తాప్సీ

గ్లామర్ పరంగా తెలుగు ప్రేక్షకులను మెప్పించిన తాప్సీకి, ఆ తరువాత అంతగా అవకాశాలు రాలేదు. దాంతో కొంతకాలంపాటు కోలీవుడ్ లో ట్రై చేసి ..ఆ తరువాత బాలీవుడ్ కి వెళ్లింది. అదృష్టం బాగుండి ఆమెకి మంచి హిందీ సినిమాలు పడ్డాయి .. అవి విజయాలను తెచ్చిపెట్టాయి. ఆ విజయోత్సాహంతో ఆమె టాలీవుడ్ పై కొన్ని విమర్శలు చేసింది కూడా.

 మళ్లీ 'ఆనందో బ్రహ్మ' సినిమాతో తెలుగులో ఛాన్స్ రావడంతో, తాను చేసిన విమర్శలను మరిచిపోయింది. 'ఆనందో బ్రహ్మ' థియేటర్లలో సందడి చేస్తున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ఇక పై గ్యాప్ తీసుకోకుండా వరుసగా తెలుగు సినిమాలు చేస్తానని చెప్పింది. ఏమైనా, తాప్సీకి ఇక్కడి దర్శక నిర్మాతలు గ్యాప్ ఇస్తే .. తానే గ్యాప్ తీసుకున్నట్టుగా ఆమె మాట్లాడటం విచిత్రం. తాను వరుసగా తెలుగు సినిమాలు చేస్తుంది సరే .. కానీ ఇచ్చేవారేరి? అనేది ఫిల్మ్ నగర్లో వినిపిస్తోన్న టాక్.        

  • Loading...

More Telugu News