jagapathibabu: నేను ఎవరినీ వదిలిపెట్టను : జగపతిబాబు

బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన 'జయ జానకి నాయక' .. విడుదలైన ప్రతి చోటున విజయ విహారం చేస్తోంది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను 'హంసలదీవి'లో చిత్రీకరించారు. అదే ప్రదేశంలో తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ వేదికపై జగపతిబాబు తనదైన శైలిలో మాట్లాడారు.

 'లెజెండ్ కి ముందు తనపని అయిపోయిందని అంతా అనుకున్నారని జగపతిబాబు చెప్పారు. ఆ సినిమాలో ఓ మొండివాడిగా తనని బోయపాటి చూపించాడని అన్నారు. నిజంగానే తాను చాలా మొండివాడినని చెప్పారు. ఇండస్ట్రీని .. సినిమాలను .. అభిమానులను ఎవరినీ వదిలిపెట్టనని అన్నారు. తాను ఎక్కడికీ వెళ్లాననీ .. ఎప్పటికీ అభిమానులతోనే ఉంటానని చెప్పారు. తనని అంతా 30 సంవత్సరాలుగా ఆదరిస్తున్నారనీ .. అందరి హార్ట్స్ కి తన హార్ట్ చాలా దగ్గరగా ఉంటుందని అన్నారు.. హీరోగా .. విలన్ గా తనని ఆదరిస్తూ వస్తోన్న ప్రేక్షకులకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.  
jagapathibabu

More Telugu News