nani : రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న 'మిడిల్ క్లాస్ అబ్బాయి'

వరుస సినిమాలతో నాని దుమ్మురేపేస్తున్నాడు. వైవిధ్యభరితమైన సినిమాలతో వీలైనన్ని విజయాలను సొంతం చేసుకుంటూ తన సత్తా చాటుతున్నాడు. ఆయన తాజా చిత్రంగా 'మిడిల్ క్లాస్ అబ్బాయి' తెరకెక్కుతోంది. దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.

 నాని సరసన కథానాయికగా సాయిపల్లవి నటిస్తోంది. ఈ కాంబినేషన్లో నిర్మితమవుతోన్న ఈ సినిమాను డిసెంబర్ 21వ తేదీన విడుదల చేయాలని ఖరారు చేసుకున్నారు. నానికి నేచురల్ స్టార్ అనే బిరుదు వుంది. ఇక 'ఫిదా' సినిమాతో సాయిపల్లవి కూడా సహజనటి అనే పేరును సంపాదించుకుంది. ఇద్దరూ కూడా తమ సహజమైన నటనతో కథా కథనాలను నడిపించగల సామర్థ్యం కలిగినవారే. అందువలన ఈ సినిమాపై యూత్ లో అంచనాలు భారీగానే పెరిగే ఛాన్స్ వుంది.    
nani
sai pallavi

More Telugu News