madan karky: మహేశ్ కోసం పాట రాస్తోన్న 'కిలికి' భాష క్రియేటర్

మహేశ్ బాబు అభిమానులంతా కూడా ఆయన తాజా చిత్రం 'స్పైడర్' కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను వచ్చేనెల 27వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఒక్క పాట మాత్రమే పెండింగ్ వుంది. ఆ పాట రాసే అవకాశం మదన్ కార్కీకి దక్కింది. 'బాహుబలి' సినిమా కోసం 'కిలికి' భాషను క్రియేట్ చేసింది ఆయనే. ఆ భాషలో కాలకేయుడు చెప్పిన డైలాగ్స్ ఎంత పాప్యులర్ అయ్యాయో తెలిసిందే.

అలాంటి మదన్ కార్కీకి 'స్పైడర్' మూవీ కోసం పాటను రాసే అవకాశాన్ని మురుగదాస్ ఇచ్చాడట. మదన్ కార్కీ గేయ రచయిత అయినప్పటికీ  తెలుగు సినిమా కోసం పాట రాయడం ఇదే మొదటిసారి. ఈ ఛాన్స్ ఇచ్చిన మురుగదాస్ కి కృతజ్ఞతలు చెబుతూ ఆయన ట్వీట్ చేశాడు. తనపై మురుగదాస్ .. మహేశ్ బాబు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పాడు.
madan karky

More Telugu News