manchu lakshmi: మంచులక్ష్మి ప్రధాన పాత్రగా కొత్త సినిమా మొదలు

నటిగా .. నిర్మాతగా మంచు లక్ష్మి మంచి పేరు సంపాదించుకున్నారు. నటిగా విభిన్నమైన పాత్రలను చేస్తూనే, అప్పుడప్పుడు తన అభిరుచికి తగిన సినిమాలను నిర్మిస్తున్నారు. తాజాగా మంచు ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఆమె ఒక సినిమాను నిర్మిస్తూ .. ప్రధానమైన పాత్రను పోషించనున్నారు. ఈ సినిమాను నిన్ననే లాంచ్ చేశారు.

 రాజమౌళి దగ్గర 'ఈగ' .. 'బాహుబలి 1' సినిమాలకి పనిచేసిన విజయ్ యలకంటి ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తమ బ్యానర్ పై కొంత గ్యాప్ తరువాత ఈ సినిమాను చేస్తున్నట్టు మంచు లక్ష్మి చెప్పారు. నిజం కాని ఒక విషయాన్ని నిజమని భావించే ఓ యువతి చుట్టూ తిరిగే కథ ఇదని ఆమె అన్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని చెప్పారు.    
manchu lakshmi

More Telugu News