: పశ్చిమ బెంగాల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ‘తృణమూల్’ క్లీన్ స్వీప్

పశ్చిమ బెంగాల్ లోని ఏడు స్థానిక సంస్థలకు నిర్వహించిన ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. ఈ ఎన్నికల్లో ‘తృణమూల్’ విజయం సాధించి తన సత్తా చాటుకుంది. ఈస్ట్ మిడ్నాపూర్ లోని రెండు మునిసిపాలిటీలకు, దక్షిణ దినాజ్ పూర్, బీర్బమ్, జల్పాయ్ గురి లోని ఒక్కో మునిసిపాలిటీతో పాటు దుర్గాపూర్ మునిసిపల్ కార్పొరేషన్ (డీఎంసీ), నదియా జిల్లాలోని కూపర్స్ క్యాంపు నోటిఫైడ్ ఏరియాకు ఈ నెల 13న ఈ ఎన్నికలు నిర్వహించారు.

ప్రతిష్టాత్మక హల్దియా మునిసిపాలిటీలో మొత్తం 29 స్థానాలను ‘తృణమూల్’ కైవసం చేసుకుంది. పన్స్ కురాలో మొత్తం 18 స్థానాలకు గాను పదిహేడింటిని తృణమూల్ తన ఖాతాలో వేసుకుంది. ఒక్క స్థానాన్ని మాత్రమే బీజేపి దక్కించుకుంది. దుర్గాపూర్ మునిసిపల్ కార్పొరేషన్ లో మొత్తం 43 స్థానాలను తృణమూల్ దక్కించుకోవడం విశేషం. దీంతో, తృణమూల్ కార్యకర్తలు, నాయకులు సంబరాల్లో మునిగిపోయారు.

More Telugu News