mahesh babu: ఒకసారి 'స్పైడర్' చూశాక డిసైడ్ చేద్దాం: హిందీ వెర్షన్ పై మహేశ్ బాబు

తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో దర్శకుడిగా మురుగదాస్ కి ఎంతో క్రేజ్ వుంది. అందువలన ఆయన 'స్పైడర్' సినిమాను ఈ మూడు భాషల్లోను రిలీజ్ చేయాలనే ఆలోచనలో వున్నాడు. మహేశ్ నేరుగా చేస్తోన్న తమిళ సినిమా ఇదే. ఈ సినిమాను హిందీలో విడుదల చేయాలనే దర్శక నిర్మాతల ఆలోచనకు మహేశ్ అడ్డు చెప్పాడట.

 సౌత్ ఆడియన్స్ టేస్ట్ కి తగినట్టుగా తెరకెక్కిన ఈ సినిమా, నార్త్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందా .. లేదా అనేదే ఆయన డౌట్. హిందీ వాళ్లకి ఇది ఒక అనువాద చిత్రంగా అనిపించకూడదనేది ఆయన అభిప్రాయం. అందువలన ఫైనల్ కాపీ చూసుకున్న తరువాత ఈ విషయంలో ఒక నిర్ణయానికి వద్దామని అన్నాడట. ఈ కారణంగానే హిందీ వెర్షన్ కి సంబంధించిన ప్రమోషన్స్ ను మొదలెట్టలేదని చెప్పుకుంటున్నారు.   

More Telugu News