sharvanad: 'మహానుభావుడు' ఫస్టులుక్ రిలీజ్ డేట్!

మొదటి నుంచి కూడా వైవిధ్యభరితమైన చిత్రాలను చేస్తూ వస్తోన్న శర్వానంద్, ఈసారి మారుతికి ఓకే చెప్పేశాడు. ఈ మధ్యనే సెట్స్ పైకి వెళ్లిన ఈ సినిమా, నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటూ వచ్చింది. ఒక పాట మినహా మిగతా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. దాంతో ఈ సినిమా నుంచి ఫస్టు లుక్ ను .. ఫస్టు టీజర్ ను ఒకేసారి వదలడానికి రెడీ అవుతున్నారు.

 అందుకు ఈ నెల 24వ తేదీని ముహూర్తంగా ఖరారు చేసుకున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో, శర్వానంద్ సరసన మెహ్రీన్ కథానాయికగా అలరించనుంది. తమన్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు. దసరాకి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. 'బాబు బంగారం' తరువాత మారుతి చేస్తోన్న ఈ సినిమా, ఆయనకి హిట్ ఇస్తుందేమో చూడాలి.   

More Telugu News