surya: నయన్ .. విఘ్నేశ్ శివన్ ల ప్రేమ వ్యవహారం పై నో కామెంట్: కీర్తి సురేశ్

తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో నయనతారకి గల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. అలాంటి నయనతార దర్శకుడు విఘ్నేశ్ శివన్ ప్రేమలో పడిందనే వార్తలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో సూర్య కథానాయకుడిగా 'తానా సెరిందా కూట్టమ్' చిత్రం తెరకెక్కింది. ఇందులో కథానాయికగా కీర్తి సురేశ్ నటించింది.

 రీసెంట్ గా ఈ సినిమా యూనిట్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమయంలోనే .. నయన్ - విఘ్నేశ్ శివన్ ల ప్రేమ వ్యవహారం గురించి మీడియా వారు కీర్తి సురేశ్ ను అడిగారు. ఊహించని ఈ ప్రశ్నకి ఆమె బిత్తరపోయిందట. తనని ఇరకాటంలో పడేసే ఈ ప్రశ్నకి ఏమని సమాధానం చెప్పాలో తెలియక అమ్మడు తికమక పడిపోయింది. వెంటనే తెలివి తెచ్చుకుని .. "నో కామెంట్ " అంటూ అక్కడి నుంచి నెమ్మదిగా జారుకుందట. మొత్తానికి కీర్తి సురేశ్ తెలివైనదేనండోయ్.     

  • Loading...

More Telugu News