shivaji raja: తెలుగు తెరపైకి మరో నట వారసుడు!

సీనియర్ హీరోలు మాత్రమే కాదు .. మిగతా నటీనటులు కూడా తమ పిల్లలను వెండితెరకి పరిచయం చేయడానికి ఉత్సాహాన్ని చూపుతున్నారు. అలాంటి వారి జాబితాలో 'మా' అధ్యక్షుడు .. సీనియర్ నటుడు శివాజీరాజా కూడా చేరనున్నట్టు తెలుస్తోంది. శివాజీరాజా తనయుడు విజయ్ .. టీనేజ్ లోకి అడుగుపెట్టాడు. అతణ్ణి హీరోగా పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే శివాజీ రాజా .. యాక్టింగ్ స్కూల్లో నటన .. డాన్స్ లో శిక్షణ ఇప్పిస్తున్నారు.

 కొంతమంది దర్శక నిర్మాతలు ఈ కుర్రాడిని తమ సినిమా ద్వారా పరిచయం చేయాలనే ఆసక్తిని చూపుతున్నారు. అయితే ముందుగా తనకి కథ వినిపించమనీ .. తన తనయుడికి తగిన కథ .. పాత్ర అనుకుంటే ఓకే చెబుతానని శివాజీ రాజా అంటున్నారట. త్వరలోనే విజయ్ అరంగేట్రం ఉండొచ్చని చెప్పుకుంటున్నారు. మొత్తానికి తెలుగు తెరపైకి మరో నట వారసుడు వచ్చేస్తున్నాడన్న మాట.   
shivaji raja
vijay

More Telugu News