: స్కూలు భవనానికి అద్దె చెల్లించలేక... రజనీ కాంత్ భార్య నిర్వహిస్తున్న పాఠశాలకు తాళం!

సినీన‌టుడు రజనీకాంత్‌ సతీమణి లతా రజనీకాంత్ నిర్వహిస్తున్న ఓ స్కూల్ మూత‌బ‌డింది. అందుకు ఆమె ఆ స్కూలు భ‌వ‌నానికి అద్దె చెల్లించ‌క‌పోవ‌డ‌మే కార‌ణం. చెన్నై లోని గిండీలో ఆమె ఆశ్రమ్‌ మెట్రిక్యులేషన్ స్కూలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడీ స్కూలు మూసివేసిన కార‌ణంగా ఆ బ్రాంచ్‌లోని సుమారు 300 మంది విద్యార్థులను వేరే బ్రాంచ్‌కు తరలించారు. ఈ విష‌యంపై స్పందించిన ఆ పాఠ‌శాల సిబ్బంది.. తాము ఆ స్కూలుని మూసివేయడానికి కార‌ణం అద్దె చెల్లించక‌పోవ‌డం కాద‌ని చెప్పుకొచ్చింది.
 
ఆ స్కూలు భ‌వ‌నానికి ర‌జ‌నీకాంత్ భార్య‌ అద్దె స‌రిగా చెల్లించడంలేదని 2011లో భూస్వామి కోర్టులో సివిల్‌ సూట్‌ వేశారు. ఆ కేసు ఇప్ప‌టికీ కోర్టులో న‌డుస్తూనే ఉంది. మ‌రోవైపు ఆ స్కూల్‌లో ఆరు నెలల నుంచి త‌మ యాజ‌మాన్యం జీతాలు చెల్లించలేదని అందులోని టీచ‌ర్లు గ‌త ఏడాది ఓసారి ఆందోళ‌న చేశారు. అప్ప‌ట్లో కేంద్ర ప్ర‌భుత్వం పెద్దనోట్లు రద్దు చేయ‌డ‌మే తాము టీచ‌ర్ల‌కి జీతాలు చెల్లించ‌క‌పోవ‌డానికి కార‌ణ‌మ‌ని స్కూల్ యాజ‌మాన్యం చెప్పుకొచ్చింది. 

More Telugu News