: ఆ చిన్నారులు చనిపోయింది ఆక్సిజన్ అందక కాదు!: కేంద్ర ప్ర‌భుత్వ క‌మిటీ నివేదిక‌

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో గోర‌ఖ్ పూర్‌లోని ప్ర‌భుత్వాసుప‌త్రిలో మెద‌డువాపు వ్యాధికి చికిత్స పొందుతూ 70 మందికి పైగా చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌పై ఏర్పాటైన‌ ముగ్గురు స‌భ్యుల‌ కేంద్ర ప్ర‌భుత్వ క‌మిటీ నివేదిక‌ను అందించి, ఆ చిన్నారులు చ‌నిపోయిన కార‌ణాన్ని వివ‌రించింది. చిన్నారులు చ‌నిపోవ‌డానికి కార‌ణం ఆక్సిజ‌న్ అంద‌కపోవడం కాద‌ని అందులో పేర్కొంది. అంతేగాక‌, ఇదే సీజ‌న్‌లో గ‌త ఏడాది ఇంతకంటే ఎక్కువ మంది చిన్నారులు చ‌నిపోయార‌ని చెప్పుకొచ్చింది. ఈ ఘ‌ట‌న‌పై స‌మ‌గ్ర‌ ద‌ర్యాప్తు చేప‌ట్టేందుకు ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్ కూడా ముగ్గురు స‌భ్యుల బృందాన్ని ఆ ఆసుప‌త్రికి పంపించింది. 

More Telugu News