chiranjeevi: చడీ చప్పుడూ లేకుండా మొదలైన 'ఉయ్యాలవాడ'

చిరంజీవి 151వ సినిమాగా 'ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి' సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా టైటిల్ లోగోను ఆగస్టు 15న ఆవిష్కరించనున్నట్టు వార్తలు వచ్చాయి గానీ, అలా జరగలేదు. ఇక ఈ సినిమాను చిరంజీవి పుట్టిన రోజైన ఆగస్టు 22న లాంచ్ చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. దాంతో అభిమానులంతా ఆ డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా పూజా కార్యక్రమాలు చడీ చప్పుడూ లేకుండా మొదలు కావడం విశేషం.

 ఆర్భాటాలు అనవసరం అనుకున్నారో ఏమో, హైదరాబాద్ లో కొణిదెల ప్రొడక్షన్స్ ఆఫీసులో ఈ రోజు ఉదయం ఈ సినిమా పూజా కార్యక్రమాలను సింపుల్ గా కానిచ్చేశారు. చిరంజీవి .. సురేఖ .. చరణ్ .. అల్లు అరవింద్ .. సురేందర్ రెడ్డి .. పరుచూరి బ్రదర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతా కలిసి దర్శకుడు సురేందర్ రెడ్డికి స్క్రిప్ట్ ను అందించారు. రెగ్యులర్ షూటింగ్ ఎప్పటి నుంచి మొదలవుతుందనేది ఇంకా ప్రకటించలేదు. త్వరలో ఎనౌన్స్ చేస్తారేమో చూడాలి. 

More Telugu News