: జాతీయ జెండా ఎగుర‌వేసిన కోతి... వీడియో చూడండి!

71వ స్వాతంత్ర్య దినోత్సవం సంద‌ర్భంగా ఓ కోతి జాతీయ ప‌తాకాన్ని ఎగుర‌వేసింది. కావాల‌ని కాదులెండి! దాని కోతి చేష్ట‌ల్లో భాగంగా స్తంభానికి వేలాడుతున్న జాతీయ ప‌తాకాన్ని వేడుక ప్రారంభానికి ముందే విప్పేసి అల్ల‌రి చేసింది. ఈ సంఘ‌ట‌న హర్యానాలోని అంబాలాలో జ‌రిగింది. అక్క‌డి  ప్రభుత్వ పాఠశాల భ‌వ‌నంపై త్రివ‌ర్ణ ప‌తాకాన్ని ఏర్పాటు చేశారు. దాన్ని ఆ పాఠ‌శాల ప్ర‌ధానోపాధ్యాయుడు ఎగుర‌వేయాల్సి ఉంది. అయితే ప్ర‌ధానోపాధ్యాయుడి కంటే ముందే ఓ కోతి ఆ జెండాను ఎగుర‌వేసింది. ఈ సంఘ‌ట‌న చూస్తూ అక్క‌డి పిల్ల‌లు, ఉపాధ్యాయులు, అతిథులు ఆశ్చ‌ర్య‌పోయారు. ఎంత ప్ర‌య‌త్నించినా కోతి జెండా క‌ర్ర‌ను ప‌ట్టుకుని ఊపుతుండ‌టంతో చేసేది లేక లోలోప‌ల న‌వ్వుకున్నారు. ఆ కోతికి మరో కోతి జతకలవడంతో.. ఆ రెండు కోతులు క‌లిసి చేసిన ఈ అల్ల‌రిని వీడియో తీసి యూట్యూట్‌లో కూడా పెట్టారు. మీరూ చూడండి!

More Telugu News