sai dharam tej: మెగా హీరోతో కరుణాకరన్ మూవీ మొదలైపోయింది!

దర్శకుడు కరుణాకరన్ పేరు వినగానే తొలిప్రేమ .. హ్యాపీ .. చిన్నదాన నీ కోసం వంటి ప్రేమకథా చిత్రాలు గుర్తుకు వస్తాయి. హృదయానికి హత్తుకునే ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్ గా ఆయనకి మంచి పేరుంది. అలాంటి కరుణాకరన్ .. సాయి ధరమ్ తేజ్ కథానాయకుడిగా ఒక సినిమాను తెరకెక్కించనున్నాడు. కె. ఎస్. రామారావు నిర్మిస్తోన్న ఈ సినిమా, కొంత సేపటి క్రితం పూజా కార్యక్రమాలు జరుపుకుంది.

 హైదరాబాద్ .. ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్లో ఈ కార్యక్రమాన్ని జరిపారు. ఈ సందర్భంగా కె. ఎస్.రామారావు మాట్లాడుతూ .. ఇది తమ బ్యానర్లో తెరకెక్కుతోన్న 45వ సినిమా అని అన్నారు. దసరా నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని చెప్పారు. యూత్ ఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి, గోపీసుందర్ సంగీతాన్ని అందిస్తున్నారని అన్నారు.  
sai dharam tej
anupama

More Telugu News