: స్మార్ట్ ఫోన్ కనిపించకుంటే అత్యంత సులువుగా కనిపెట్టే మార్గం... ఇదిగో!

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ కనిపించడం లేదా? ఎక్కడ పెట్టారో గుర్తు లేదా? పిల్లలు ఆడుకుంటూ మరెక్కడైనా ఉంచి మరచిపోయారా? లేదా ఎవరైనా తీసుకెళ్లి ఉంటారని అనుకుంటున్నారా? ఫోన్ ఎక్కడుందో పట్టుకోవడం ఈ విధానంలో చాలా సులువు. ఆండ్రాయిడ్ ఫోన్ ఏదైనా జీమెయిల్ ఐడీకి తప్పకుండా అనుసంధానమై ఉంటుందన్న సంగతి తెలుసుగా? ఆ ఒక్క ఆప్షన్ మీ ఫోన్ ఎక్కడుందో మీకు ఇట్టే చెప్పేస్తుంది.

ఇందుకోసం కంప్యూటర్ లేదా మరో స్మార్ట్ ఫోన్ నుంచి జీ మెయిల్ ఓపెన్ చేయాల్సి వుంటుంది. ఆపై కుడివైపున కనిపించే మీ ప్రొఫైల్ పిక్చర్ ను క్లిక్ చేస్తే, 'మై అకౌంట్' అన్న ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే, మరో పేజీలో అకౌంట్ సెట్టింగ్స్ వస్తాయి. అందులో 'ఫైండ్ యువర్ ఫోన్' అన్న ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి, మరోసారి వెరిఫై పాస్ వర్డ్ టైప్ చేస్తే, ఫోన్ ఎక్కడుందో పట్టేయొచ్చు. ఫోన్ సైలెంట్ లో ఉన్నా రింగ్ ఇచ్చే ఆప్షన్ తో పాటు, ఫోన్ ఎక్కడుందో మ్యాప్ లోనూ కనిపిస్తుంది. దీంతో పాటు ఫోన్ ను లాక్ చేయడం, అందులోని డేటాను తొలగించడం వంటి ఆప్షన్లూ కనిపిస్తాయి. గతంలో మీరు వాడిన ఫోన్ల వివరాలనూ గూగుల్ అందిస్తుంది. ఈ విధానం ఎలా పనిచేస్తుందన్న విషయమై ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడవచ్చు.

More Telugu News