: అసోం, బీహార్ వరద బాధితులను ఆదుకుంటాం: ప్రధాని మోదీ హామీ

అసోం, బీహార్ వరద బాధితులను ఆదుకుంటామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ఆయా రాష్ట్రాల సీఎంలతో  ఫోన్ లో మాట్లాడిన మోదీ, అక్కడి వరద పరిస్థితులపై ఆరా తీశారు. అసోంలో వరదలపై కేంద్ర ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని చెప్పారు. కాగా, బీహార్ రాష్ట్రంలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా కిషన్ గంజ్, అరారియా, పుర్ణియా, కతిహార్ జిల్లాల్లో వరదలు పోటెత్తాయి. ఇప్పటి వరకు 41 మృతి చెందినట్లు బీహార్ అధికారులు తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం నితీశ్ కుమార్ ఏరియల్ సర్వే నిర్వహించారు. వరద ప్రభావంతో బీహార్ లో మొత్తం 33 రైళ్లను రద్దు చేయగా, 11 రైళ్లను మార్గమధ్యంలో నిలిపివేశారు.

More Telugu News