shalini pande: సాయిపల్లవి బాటలోనే మరో కొత్త కథానాయిక!

తెలుగు .. తమిళం .. హిందీ .. ఇలా ఏ చిత్రపరిశ్రమకి వెళ్లినా అక్కడ గట్టిపోటీ ఉంటోంది. భాషపైనే భావ వ్యక్తీకరణ ఆధారపడి ఉంటుంది కనుక, నటీనటులకు అక్కడి భాషలు తెలిసి ఉంటే అవకాశాలను మరింత వేగంగా అందిపుచ్చుకోవడానికి వీలవుతుంది. అందుకనే ఈ మధ్యకాలంలో చాలామంది కథానాయికలు తెలుగులో అవకాశం రావడమే ఆలస్యం .. తెలుగు భాషపై దృష్టి పెడుతున్నారు. అంతేకాదు .. మొదటి సినిమాతోనే తమ పాత్రకి తామే డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. దర్శకులు కూడా ఆ దిశగా వాళ్లని ప్రోత్సహిస్తూ ఉండటం విశేషం.

'ఫిదా' ద్వారా పరిచయమైన సాయిపల్లవి తెలంగాణ యాస నేర్చుకుని మరీ డబ్బింగ్ చెప్పేసింది .. నూటికి నూరు మార్కులు కొట్టేసింది. అలాగే ఇప్పుడు 'అర్జున్ రెడ్డి' సినిమా ద్వారా షాలిని పాండే పరిచయమవుతోంది. ఆమె కూడా ఈ సినిమా కోసం తెలుగు నేర్చేసుకుని, తన పాత్రకి తాను డబ్బింగ్ చెప్పేసింది. ఆమె ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందనేది ఈ నెల 25వ తేదీన తేలిపోనుంది.  
shalini pande

More Telugu News