nayanatara: నయనతారకి ఈ టాలెంట్ కూడా ఉందండోయ్!

తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో నయనతారకి మంచి క్రేజ్ వుంది. అందం .. అంతకి మించిన అభినయం ఆమె సొంతం కావడంతో, ఆమెకు భారీ సంఖ్యలోనే అభిమానులు వున్నారు. సినిమా ప్రమోషన్స్ కి హాజరు కావడం .. ఇంటర్వ్యూలు ఇచ్చినా వ్యక్తిగత విషయాలను ప్రస్తావించడానికి ఇష్టపడక పోవడం నయనతారకి అలవాటు.

 అలాంటి ఆమె తాజాగా 'అరమ్' మూవీ ప్రమోషన్లో పాల్గొనడం ఒక విశేషమైతే, కవితలు రాయడం తన హాబీ అని చెప్పడం మరో విశేషం. ఖాళీ సమయాల్లో తాను కవితలు రాస్తుంటాననీ .. అయితే ఇంతవరకూ వాటిని ఎవరికీ చూపించలేదని చెప్పింది. వీలు చూసుకుని నయనతార ఆ కవితలను ఒక పుస్తకంగా వేయిస్తుందేమో చూడాలి మరి. బయట ఎప్పుడు చూసినా చాలా సీరియస్ గా కనిపించే నయనతారలో ఈ టాలెంట్ కూడా ఉందన్న మాట.  
nayanatara

More Telugu News