bellamkonda: ఒక్క నైజామ్ లోనే కోటి రాబట్టిన 'జయ జానకి నాయక'

లాంగ్ వీకెండ్ ను దృష్టిలో పెట్టుకుని నిన్న ఒక్కరోజునే మూడు సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా మాస్ ఆడియన్స్ ను ఎక్కువగా ఆకట్టుకుంటోంది. ఇక 'లై' సినిమా యూత్ ను ఎక్కువగా అలరిస్తోంది. 'జయ జానకి నాయక' సినిమా మాత్రం మాస్ .. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకుంటోంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదలైన ప్రతి ఏరియాలోను భారీ వసూళ్లను సాధిస్తోందట. ఒక్క నైజామ్ ఏరియాలోనే తొలి రోజున ఈ సినిమా ఒక కోటి షేర్ ను రాబట్టినట్టుగా చెబుతున్నారు. బలమైన కథా కథనాలు .. భారీ తారాగణం ఇందుకు కారణమని అంటున్నారు. వరుస సెలవులు కావడం వలన, వసూళ్లు ఒక రేంజ్ లో పెరిగే ఛాన్స్ ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.     
bellamkonda
rakul

More Telugu News