balakrishna: ఐ యామ్ ఎ ఫ్యాన్ ఆఫ్ ఎన్బీకే .. ఐ హ్యావ్ 101 ఫీవర్ : పూరి జగన్నాథ్

బాలకృష్ణ 101వ సినిమాగా 'పైసా వసూల్' ను పూరి జగన్నాథ్ సిద్ధం చేశాడు. "నేను బాలకృష్ణ గురించి విన్నాను .. కానీ ఈ సినిమా ద్వారా ఆయన గురించి ప్రత్యక్షంగా తెలుసుకోగలిగాను. ఇంతకాలం బాలకృష్ణతో సినిమా చేయలేకపోయినందుకు నేను చాలా బాధపడుతున్నాను" అని ఈ సినిమా షూటింగ్ సమయంలో పూరి జగన్నాథ్ చెప్పారు. తాను బాలకృష్ణకి వీరాభిమానిగా మారిపోయానని అన్నారు.

 అదే విషయాన్ని అభిమానులకు మరోమారు గుర్తు చేస్తూ, 'ఐ యామ్ ఎ ఫ్యాన్ ఆఫ్ ఎన్బీకే .. ఐ హ్యావ్ 101 ఫీవర్" అంటూ ఈ సినిమా గురించి ప్రస్తావించారు. అంతేకాదు, అచ్చు బాలకృష్ణ మాదిరిగా ఓ పోజు ఇచ్చేసి .. ఆ పోస్టర్ ను పోస్ట్ చేసి మరింత ఆసక్తిని రేకెత్తించారు. సెప్టెంబర్ 1న ఈ సినిమా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.  

More Telugu News