sai pallavi: డబ్బు కోసం ఓపెనింగులకు రానంటున్న సాయిపల్లవి!

'ఫిదా' చిత్రం తరువాత సాయిపల్లవికి వచ్చిన క్రేజ్ అంతాఇంతా కాదు. ఆమెతో తమ సినిమాలు చేయడానికి చాలామంది దర్శక నిర్మాతలు ఉత్సాహాన్ని చూపుతున్నారట. అయినా కథల ఎంపికలో తొందర పడకుండా ఆమె ఆచి తూచి వ్యవహరిస్తోందని అంటున్నారు.

ఇక షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవాలు కూడా ఆమె చేతుల మీదుగా జరిపించడానికి చాలా మంది ఆసక్తిని కనబరుస్తున్నారట. పారితోషికంగా భారీ మొత్తమే ముట్టజెబుతామని అంటున్నారు. అయితే సాయి పల్లవి మాత్రం .. డబ్బు కోసం ఇలా చేయడం తనకి ఎంత మాత్రం ఇష్టం ఉండదని చెప్పింది. సామాజిక సేవా కార్యక్రమాలకైతే ఒక్క రూపాయి ఇవ్వకపోయినా వస్తానని అంది. తమకి వచ్చిన క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి కొంతమంది కథానాయికలు ప్రయత్నిస్తుంటే, సాయిపల్లవి మాత్రం మంచితనంతోను 'ఫిదా' చేస్తోంది.  
sai pallavi

More Telugu News