sai dharam tej: మెగా హీరో మూవీ లావణ్యకి కలిసొచ్చేనా?

తెలుగు తెరకు నాజూకు సౌందర్యాన్ని పరిచయం చేసిన కథానాయికలలో లావణ్య త్రిపాఠి ఒకరు. నాని .. శర్వానంద్ .. అల్లు శిరీష్ వంటి హీరోలతో సినిమాలు చేసిందే గానీ, స్టార్ హీరోల సరసన ఛాన్సులు సంపాదించుకోలేకపోతోంది. చరణ్ .. అల్లు అర్జున్ .. ఎన్టీఆర్ వంటి హీరోల మూవీల్లో ఆమెకి అవకాశాలు దక్కాల్సి వుంది.

ఈ నేపథ్యంలోనే ఆమెకి సాయిధరమ్ తేజ్ హీరోగా వినాయక్ చేస్తోన్న సినిమాలో ఛాన్స్ వచ్చింది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమా తనకి బాగా కలిసొస్తుందనే నమ్మకంతో లావణ్య వుంది. మెగా హీరోతో చేస్తోన్న ఈ సినిమా హిట్ అయితే, అదే క్యాంప్ కి చెందిన చరణ్ .. అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సరసన చేసే ఛాన్స్ దక్కుతుందేమోననే ఆశతో వుంది. మెగా హీరోల సినిమాల్లో అవకాశాలను అందిపుచ్చుకునే విషయంలో రకుల్ మాదిరిగా ఆమె దూసుకుపోతుందో .. రెజీనాలా వెనకబడుతుందో చూడాలి.  
sai dharam tej
lavanya

More Telugu News