sai dharam tej: సాయిధరమ్ తేజ్ ను వినాయక్ కొత్తగా చూపిస్తాడట!

సాయిధరమ్ తేజ్ తో వినాయక్ మూవీ లాంచ్ అయింది. వరుస పరాజయాలతో వున్న తేజుకి వినాయక్ లాంటి దర్శకుడితో ఒక సినిమా పడాల్సిందేననే అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేశారు. ఇంతకుముందు చిరంజీవితో 'ఖైదీ నెంబర్ 150' .. చరణ్ తో 'నాయక్' సినిమాలను వినాయక్ చేశాడు. ఆ రెండు సినిమాలను గుర్తుకు తెచ్చేదిలా తేజు మూవీ వుండాలని ఆయన అభిమానులు భావిస్తున్నారు.

 ఇంతవరకూ తేజు పూర్తి స్థాయి కామెడీ చేసిన దాఖలాలు లేవు. ఈ సినిమాలో ఆయన శైలి యాక్షన్ తో పాటు కావలసినంత కామెడీ ఉంటుందని రచయిత ఆకుల శివ అన్నారు. తేజు ఈ సినిమాలో మరింత కొత్తగా కనిపిస్తాడని చెప్పారు. ఈ సినిమాలో కథానాయికగా లావణ్య త్రిపాఠిని తీసుకున్నారు. వచ్చే నెల మొదటి వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.  
sai dharam tej
lavanya

More Telugu News