nithin: హను రాఘవపూడిపై ఆ ముద్ర చెరిగిపోతుందా?

దర్శకుడు హను రాఘవపూడి పేరు వినగానే .. 'అందాల రాక్షసి' గుర్తుకు వస్తుంది. ఈ ప్రేమ కథా చిత్రం యూత్ కి బాగానే కనెక్ట్ అయింది. అయితే ఫస్టాఫ్ ను అద్భుతంగా హ్యాండిల్ చేసిన ఆయన, సెకండాఫ్ లో కాస్త నిరాశపరిచాడనే టాక్ వచ్చింది.

ఇక ఆయన దర్శకత్వంలో వచ్చిన 'కృష్ణగాడి వీరప్రేమగాథ' కూడా సక్సెస్ జాబితాలోకి చేరిపోయింది. ఈ సినిమా విషయంలోను సెకండాఫ్ విషయంలో కాస్త పట్టుకోల్పోయాడనే విమర్శలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన 'లై' సినిమాతో ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. గతంలో వచ్చిన విమర్శలను దృష్టిలో పెట్టుకున్న ఆయన, ఈ సినిమా సెకండాఫ్ విషయంలో మరింత శ్రద్ధ పెట్టాడని అంటున్నారు. ఈసారి శభాష్ అనిపించుకుంటాడేమో చూడాలి మరి.  
nithin
megha akash

More Telugu News