bellamkonda: భయం లేదు .. భారీ ఓపెనింగ్స్ ఖాయం : బోయపాటి

సినిమా ప్రేమికులంతా ఈ నెల 11వ తేదీపై ఆసక్తిని చూపుతున్నారు. ఎందుకంటే ఆ రోజున 'నేనే రాజు నేనే మంత్రి' .. 'లై' .. 'జయ జానకి నాయక' చిత్రాలు విడుదల కానున్నాయి. గట్టిపోటీ ఉన్నప్పటికీ ఎవరికి వారు తమ కంటెంట్ పై నమ్మకంతో వున్నారు. బోయపాటి మాటల్లోను అదే ధీమా వ్యక్తమవుతోంది.

 'జయ జానకి నాయక' కొత్త జోనర్లో తెరకెక్కిందని బోయపాటి అన్నారు. తాను ఇంతవరకూ తెరకెక్కించిన సినిమాలకి ఇది ఒక మెట్టు పైనే ఉంటుందని చెప్పారు. యూత్ ను .. ఫ్యామిలీ ఆడియన్స్ ను  ఆకట్టుకునే అంశాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయని అన్నారు. కథాబలమున్న సినిమా కనుకనే తాము భయపడవలసిన అవసరం లేదని చెప్పారు. దాదాపు ఈ సినిమా 700 థియేటర్స్ లో విడుదలవుతుంది గనుక, భారీ ఓపెనింగ్స్  ఖాయమనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఈ మూడింటిలో ఎక్కువ స్కోర్ ఏ సినిమా చేస్తుందో చూడాలి.  
bellamkonda
rakul

More Telugu News