devisri prasad: అందుకే బాలీవుడ్ కి వెళ్లడం ఇష్టం వుండదు : దేవిశ్రీ ప్రసాద్

టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో దేవిశ్రీ ప్రసాద్ ఒకరు. యూత్ లో ఆయన పాటలకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. జోరైన .. హుషారైన పాటలతో ప్రేక్షకులను ఆయన మంత్రముగ్ధులను చేస్తుంటాడు. అలాంటి దేవిశ్రీకి బాలీవుడ్ నుంచి కూడా భారీగానే అవకాశాలు వస్తుంటాయి. కానీ ఆయన పెద్దగా ఆసక్తిని చూపించడు. అందుకు కారణం అడిగితే ఆయన తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు.

బాలీవుడ్ లో ఒకే సినిమాలో ఒక్కొక్క పాటకి ఒక్కో మ్యూజిక్ డైరెక్టర్ పనిచేస్తూ ఉంటాడనీ .. అది తనకి నచ్చదని ఆయన చెప్పాడు. ఒక్కో పాటకి ఒక్కో మ్యూజిక్ డైరెక్టర్ పనిచేయడం వలన, సినిమాకి న్యాయం జరగదనేది తన ఫీలింగ్ అని అన్నాడు. ఒకే మ్యూజిక్ డైరెక్టర్ అన్ని పాటలు చేస్తున్నప్పుడు .. ఎక్కడా ఫీల్ మిస్ కాకుండా చూసుకోవచ్చనీ, ఈ పద్ధతికి భిన్నంగా ఉంటుంది కనుకనే తాను బాలీవుడ్ సినిమాలకి దూరంగా ఉంటానని చెప్పుకొచ్చాడు.   
devisri prasad

More Telugu News