mammootty: మమ్ముట్టి 400వ మూవీలో దుల్కర్ సల్మాన్!

మలయాళ సూపర్ స్టార్ గా మమ్ముట్టికి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. తన 35 సంవత్సరాల నట ప్రయాణంలో ఆయన ఎన్నో విజయవంతమైన సినిమాలు చేశారు. విభిన్నమైన కథలతో .. విలక్షణమైన పాత్రలతో  ఇతర భాషా ప్రేక్షకులను సైతం మెప్పించారు. అలా ఇంతవరకూ 399 సినిమాలను పూర్తి చేసిన ఆయన, తాజాగా 400వ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు.

 సెప్టెంబర్ 7వ తేదీన మమ్ముట్టి పుట్టినరోజు .. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, 400వ సినిమా వివరాలను వెల్లడించనున్నారు. ఆయన కెరియర్లో భారీ విజయాన్ని నమోదు చేసిన ఒక సినిమాకి ఇది సీక్వెల్ గా రానుందని అంటున్నారు. 'అమల్ నీరద్' దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో, ఒక ముఖ్యమైన పాత్రలో దుల్కర్ సల్మాన్ కూడా నటించనుండటం విశేషం.     
mammootty

More Telugu News