nani: నాని మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన అనుపమ పరమేశ్వరన్!

అనుపమ పరమేశ్వరన్ ఏ ముహూర్తంలో తెలుగు తెరకి పరిచయమైందో గానీ, అప్పటి నుంచి ఆమెకి అపజయమనేది లేకుండా పోయింది. ఆమె చేసిన మూడు సినిమాలు కూడా ఒకదానికి మించి మరొకటి ఘన విజయాలను అందుకున్నాయి. దాంతో ఆమెని వరుస అవకాశాలు పలకరిస్తున్నాయి.

 ప్రస్తుతం ఆమె రామ్ కి జోడీగా 'ఉన్నది ఒకటే జిందగీ' సినిమా చేస్తోంది. తదుపరి చిత్రాన్ని ఆమె నానితో చేయనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు నాని 'మిడిల్ క్లాస్ అబ్బాయి' సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో వేణుశ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఆ తరువాత ఆయన మేర్లపాక గాంధి దర్శకత్వంలో 'కృష్ణార్జున యుద్ధం' సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో నాని రెండు పాత్రలను పోషించనుండగా, ఒక పాత్ర సరసన అనుపమ పరమేశ్వరన్ ను తీసుకున్నట్టుగా చెబుతున్నారు.   
nani
anupama

More Telugu News