prakash raj: మహేశ్ మూవీ నుంచి ప్రకాశ్ రాజ్ ను తప్పించేస్తారా?

ప్రకాశ్ రాజ్ గొప్ప నటుడు అని ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు చూసిన ప్రతి ఒక్కరికీ ఈ విషయం తెలుసు. ప్రకాశ్ రాజ్ ఎలాంటి పాత్రకైనా జీవం పోయగలరు. ఎలాంటి రసాన్నైనా అద్భుతంగా పండించగలరు. అందువలన ఆయన డేట్స్ కుదిరేంతవరకూ దర్శక నిర్మాతలు ఎదురుచూసేవారు.

 అంతటి నటుడిపై ఇండస్ట్రీలో వినిపించే విమర్శలు కూడా ఎక్కువే. తన వ్యవహార శైలితో ఆయన అవతలివారిని విసిగిస్తూ ఉంటారని చెప్పుకుంటారు. ఈ ధోరణి కారణంగానే 'భరత్ అను నేను' అనే సినిమా నుంచి ఆయనని తప్పించే ఆలోచనలో దర్శక నిర్మాతలు వున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఆయన స్థానంలో వేరొకరిని తీసుకునే అవకాశం వుందనే టాక్ వినిపిస్తోంది. రాజేంద్రప్రసాద్ .. రావు రమేశ్ లలో ఎవరో ఒకరిని తీసుకోవచ్చని చెప్పుకుంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి.    
prakash raj

More Telugu News