rajanikanth: శంకర్ దర్శకత్వంలో వెండితెరపై సీఎంగా రజనీకాంత్?

శంకర్ దర్శకత్వంలో గతంలో వచ్చిన 'ముదల్వన్' తమిళనాట విజయవిహారం చేసింది. అర్జున్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా, తెలుగులో 'ఒకే ఒక్కడు' పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పట్లో ఈ సినిమాను ముందుగా రజనీతోనే చేయడానికి శంకర్ ప్రయత్నించినా, ఆయన పెద్దగా ఆసక్తి చూపలేదట. అలాంటి రజనీకాంత్ ఆ సినిమా సీక్వెల్ లో చేయడానికి ఉత్సాహాన్ని చూపుతున్నారని అంటున్నారు.

తమిళ నాట రజనీకాంత్ రాజకీయ ప్రవేశానికి భారీస్థాయిలో రంగం సిద్ధమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో 'ముదల్వన్' వంటి కథతో జనాల్లోకి వెళ్లవలసిన అవసరాన్ని రజనీ గుర్తించారట. దాంతో శంకర్ రంగంలోకి దిగాడని చెప్పుకుంటున్నారు. రజనీ గుణ గణాలు .. ఆయన సీఎం అయితే ఎలా వుంటుందనే విషయాన్ని ముందుగా జనానికి తెలియజేసే ప్రయత్నంగా ఈ సినిమాను గురించి చెప్పుకుంటున్నారు. ఈ సినిమాకి విజయేంద్ర ప్రసాద్ కథను సిద్ధం చేస్తుండటం విశేషం.     
rajanikanth

More Telugu News