amalapaul: గ్లామర్ డోస్ పెంచేసి షాకిస్తోన్న అమలా పాల్!

షార్ట్స్‌లో చూడండి
తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో కథానాయికగా అమలా పాల్ కి మంచి క్రేజ్ వుంది. తెలుగులో కొత్త కథానాయికల పోటీ కారణంగా అవకాశాలు తగ్గినా, తమిళ, మలయాళ భాషల్లో తన దూకుడు చూపిస్తూనే వుంది. త్వరలో 'విఐపి 2'తో ప్రేక్షకుల ముందుకు రానున్న ఆమె, తమిళంలో ఒక సీక్వెల్ చేస్తోంది. గతంలో వచ్చిన 'తిరుట్టు పయలే' సినిమాకి ఇది సీక్వెల్.

 సుశీ గణేశన్ తెరకెక్కించిన ఈ సినిమా, అప్పట్లో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అదే దర్శకుడు ఇప్పుడు 'తిరుట్టు పయలే 2' చేస్తున్నాడు. బాబి సింహా .. అమలా పాల్ జంటగా నటిస్తోన్న ఈ సినిమాలో, ప్రసన్న ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నాడు. ఈ సినిమా పోస్టర్స్ ను బట్టి .. టీజర్ ను బట్టి అమలా పాల్ గ్లామర్ డోస్ పెంచేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమా తనకి మరో హిట్ తెచ్చిపెడుతుందని ఆమె అంటోంది. అక్టోబర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.     
Go Back to Shorts
amalapaul

More Telugu News