aravind swami: అందుకే ఫ్యాన్స్ ను దగ్గరికి రానివ్వను: అరవింద్ స్వామి

చాలామంది హీరోలకు అభిమాన సంఘాలు ఉంటాయి. వాళ్లంతా కూడా తమ అభిమాన హీరో సినిమా వచ్చినప్పుడు థియేటర్ల దగ్గర సందడి చేస్తుంటారు. తమ హీరో సినిమా కొత్త రికార్డులను సృష్టించాలని కోరుకుంటారు. అలాంటి అభిమానులకు కొంతమంది హీరోలు టచ్ లో ఉంటూ వుంటారు. అందుకు తాను పూర్తి భిన్నమని అరవింద్ స్వామి చెప్పారు.

'రోజా' .. 'బొంబాయి' సినిమాల సమయంలో అరవింద్ స్వామికి ఒక రేంజ్ లో క్రేజ్ ఉండేది. ఎంతోమంది అభిమానులు ఆయనని చూడటానికి .. మాట్లాడటానికి తోసుకొచ్చేవారట. 'రోజా' సినిమా సమయంలో ఒక టీనేజ్ అమ్మాయి రక్తంతో ఆయనకి లెటర్ రాసిందట. దాంతో అసహనానికి లోనైన అరవింద్ స్వామి .. ఇలాంటి అనవసరమైన పనులతో సమయాన్ని వృథా చేసుకోవద్దనీ .. చదువుకుని వృద్ధిలోకి రమ్మని చెబుతూ సమాధానమిచ్చాడట. ఆ రోజు నుంచి అభిమానులను తాను ప్రోత్సహించదలచుకోలేదనీ, దగ్గరికి రానిస్తే వాళ్ల భవిష్యత్ పాడైపోతుందని భావించి దూరంగానే ఉంచుతూ వచ్చానని చెప్పారు.        
aravind swami

More Telugu News