giribabu: పవన్ అంటే ఏమిటో ఇప్పుడే తెలిసింది!: గిరిబాబు

షార్ట్స్‌లో చూడండి
పవన్ కల్యాణ్ ను ఒకసారి కలిసిన వాళ్లంతా ఆయన మంచి మనసును గురించి చెబుతూ వుంటారు. అలాంటివారిలో సాధారణ ప్రేక్షకుల నుంచి సీనియర్ నటీనటుల వరకూ వున్నారు. ఆ జాబితాలో తాజాగా గిరిబాబు కూడా చేరిపోయారు. గిరిబాబు మంచి నటులు అని ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఈ మధ్య వచ్చే సినిమాల్లోనూ ఆయన అడపా దడపా కనిపిస్తున్నారు. అలాంటి ఆయన రీసెంట్ గా పవన్ - త్రివిక్రమ్ సినిమా సెట్ కి వెళ్లారట. ఆ సినిమా దర్శకత్వ శాఖలో తన మనవడు పనిచేస్తుండటంతో, అతని పనితీరు ఎలా ఉందో తెలుసుకోవడానికి వెళ్లారట.

 అప్పుడు ఆయనని పవన్ చాలా ఆత్మీయంగా పలకరించి .. మర్యాద పూర్వకంగా ఆహ్వానించారట. గిరిబాబు కుటుంబానికి సంబంధించిన క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకుని, ఆయనతో కలిసి నటించాలని ఉందని అన్నారట. అంతేకాదు .. త్రివిక్రమ్ ను పిలిచి గిరిబాబుకి తగిన పాత్ర ఏదైనా ఉందా? అని అడిగాడనీ, లేదని త్రివిక్రమ్ చెప్పడంతో .. మరోమారు కలిసి చేద్దామని పవన్ అన్నట్టుగా చెప్పారు. పవన్ మంచి మనసును గురించి విన్నాననీ .. ప్రత్యక్షంగా చూడటం ఆనందంగా ఉందని గిరిబాబు అన్నారు.
Go Back to Shorts
giribabu

More Telugu News