sukumar: పూరీని చూస్తే చాలా అసూయగా వుంది : సుకుమార్

పూరీ జగన్నాథ్ .. సుకుమార్ మంచి స్నేహితులు. కథల ఎంపికలోను .. కథనాన్ని నడిపించడంలోను ఎవరి దారి వారిదే. ఈ విషయంలో ఎవరి స్కూల్ వారిది .. ఎవరి తీరు వారిది. అయినా ఒకరి సినిమాలను ఒకరు చూడటం .. అభినందించడం జరుగుతూ ఉంటాయి. అలాంటి పూరీని చూస్తే తనకి చాలా అసూయగా ఉందని తాజాగా ఒక సందర్భంలో సుకుమార్ అన్నాడు.

పూరీ డ్రగ్స్ కేసులో విచారణను ఎదుర్కోవడం గురించి సుకుమార్ ను ప్రశ్నించగా, తనదైన శైలిలో ఆయన స్పందించాడు. డ్రగ్స్ విషయంలో తన పేరు వినిపించడం పూరీకి కొంత బాధ కలిగించినా, తనకి మరో కథ దొరికిందని ఆయన సంతోషపడి ఉంటాడని సుకుమార్ అన్నాడు. అలా ఆయనకి కథ దొరకడం తనకి చాలా అసూయను కలిగిస్తోందని చమత్కరించాడు. వాస్తవ సంఘటనల ఆధారంగా పూరీ సినిమాలు వుంటాయనే సంగతి తెలిసిందే.
sukumar
puri

More Telugu News