: షాకింగ్ అద్భుతం...విమానం తోకపై పడ్డ పిడుగు...విద్యుత్ సరఫరా అయినా బతికిన మనిషి

ఎయిర్ పోర్టులో విమానం తోకపై పడ్డ పిడుగు, ఇంజిన్ దగ్గర పని చేస్తున్న కార్మికుడికి తగిలి విద్యుద్ఘాతానికి గురైన ఘటన అమెరికాలోని ఉతర ఫ్లోరిడాలో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే... ఉత్తర ఫ్లోరిడాలోని ఫోర్ట్ మేయర్ పట్టణంలోని ఎయిర్ పోర్టులో జూలై 22న ప్రయాణానికి విమానాన్ని సిద్ధం చేస్తున్నారు. అన్ని తనిఖీలు పూర్తి కావచ్చాయి. ప్రయాణికులు ఎక్కగానే రన్ వేపైనుంచి గాల్లోకి ఎగరడమే ఆలస్యం. ఇంతలో విమానాన్ని ప్రయాణకులను ఎక్కించేందుకు పోర్ట్ ఫ్లాట్ ఫాం వద్దకు తీసుకొచ్చేందుకు ట్రక్ సిద్ధమైంది.

కాక్ పిట్ దగ్గరున్న ఫ్రంట్ గేర్, ఇంజిన్ దగ్గర ఏదోపనిలో ఆస్టిన్ డన్ (21) అనే కార్మికుడు పని చేస్తున్నాడు. ఇంతలో ఓ పిడుగు ఈ విమానం తోకపై పడింది. దీంతో భారీగా ఉత్పత్తైన విద్యుత్ విమానాన్ని చుట్టుముట్టింది. పెద్దగా మంటలు రేగాయి. ఇంజిన్ దగ్గర పని చేస్తున్న ఆస్టిన్ దాని ధాటికి మృతి చెందాల్సిందే. అయితే అదృష్టవశాత్తు, విద్యుద్ఘాతానికి అతను కిందపడిపోయాడు. దగ్గర పని చేస్తున్న కార్మికులు పరుగున వెళ్లి అతనిని ఆసుపత్రికి తరలించగా, స్వల్ప గాయాలతో బతికి బయటపడ్డాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు దేవుడు తమ పట్ల అధ్భుతం చేశాడని పేర్కొంటున్నారు. ఈ తతంగం మొత్తం సీసీ పుటేజ్ లో బట్టబయలైంది. 

More Telugu News