: కేఎల్ రాహుల్ కొట్టిన షాట్ కు శ్రీలంక ఫీల్డర్ దిమ్మదిరిగింది!

కేఎల్ రాహుల్ కొట్టిన షాట్ కు శ్రీలంక ఫీల్డర్ కు దిమ్మదిరిగింది. కొలంబో వేదికగా జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ 22వ ఓవర్ ను హెరాత్ వేశాడు. ఈ ఓవర్ లో బంతి మెలికలు తిరుగుతుండడంతో బంతి నేలపై పడగానే రాహుల్ షాట్లు ఆడడం మొదలు పెట్టాడు. దీంతో బంతి గాల్లోకి లేచే అవకాశం ఉందని భావించిన లంక కెప్టెన్.. మిడ్ వికెట్ మీద, పిచ్ కు కాస్త దూరంగా దినేష్ చండిమాల్ ను ఫీల్డింగుకి పెట్టాడు.

అది చూసిన రాహుల్ కు చిర్రెత్తింది. ప్రతిబంతిని అతని మీదకు కొట్టడం మొదలు పెట్టాడు. మూడో బంతిని మరింత బలంగా కొట్టాడు. దీంతో ఆ బంతి నేరుగా అతని హెల్మెట్ కు తగిలి నేలపై పడి మిడ్ ఆన్ లో ఫీల్డింగ్ చేస్తున్న ఫీల్డర్ చేతిలో పడింది. దీంతో బంతి బలంగా తాకినందుకు రాహుల్ సారీ చెప్పాడు. లంక ఆటగాళ్లంతా చండిమాల్ కు ఏమైనా అయిందేమోనని ఆందోళన చెందారు. 

More Telugu News