sai srinivas: బోయపాటి ఎంత మాత్రం తగ్గలేదు .. అదరగొట్టేశాడంతే!

చూస్తుంటే బెల్లంకొండ సాయి శ్రీనివాసన్ కి మాస్ ఆడియన్స్ లోనే కాదు .. యూత్ లోను క్రేజ్ ఏర్పడేలా బోయపాటి శ్రీను గట్టి ప్రయత్నమే చేసినట్టు కనిపిస్తోంది. 'జయ జానకి నాయక' చిత్రం నుంచి తాజాగా రిలీజ్ చేసిన థియేట్రికల్ ట్రైలర్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. "ఎవరున్నా లేకున్నా .. ఎవరొచ్చినా రాకున్నా .. నీకు నేనున్నా" అంటూ కథానాయికతో హీరో చెప్పే డైలాగ్ యూత్ ను ఒక రేంజ్ లో ఆకట్టుకునేదిలా వుంది.

లవ్ .. రొమాన్స్ .. యాక్షన్ .. ఎమోషన్ కలయికగా ఈ ట్రైలర్ ను కట్ చేశారు. రకుల్ .. కేథరిన్ గ్లామర్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణలా కనిపించేలా వుంది. రిషి పంజాబి ఫోటోగ్రఫీ .. దేవిశ్రీ సంగీతం .. బోయపాటి టేకింగ్ ప్రధాన బలంగా అనిపిస్తున్నాయి. సాఫ్ట్ టైటిల్ పెట్టినా యాక్షన్ పార్ట్ విషయంలో బోయపాటి ఎంత మాత్రం తగ్గలేదు .. అదరగొట్టేశాడంతే. ఆగస్టు 11న ఈ సినిమా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది.

    
sai srinivas
rakul

More Telugu News