krishnavamsi: స్టార్ హీరోలతో టచ్ లోనే వుండే కృష్ణవంశీ!

షార్ట్స్‌లో చూడండి
తెలుగు సినీ దర్శకులలో కృష్ణవంశీకి ప్రత్యేకమైన స్థానం వుంది. జయాపజయాలకు అతీతంగా ఆయన సినిమాలు ప్రత్యేకతను సంతరించుకుంటాయి. స్టార్ హీరోల కోసం కథలు రెడీ చేయడం ఆయనకి అలవాటు లేదు. తాను రెడీ చేసుకున్న కథకి తగిన హీరోలని ఆయన ఎంచుకుంటారు. చాలా తక్కువ మాట్లాడే కృష్ణవంశీ అంత తొందరగా ఎవరితోనూ కలవరనే ప్రచారం వుంది.

 అయితే తనతో సినిమాలు చేసిన హీరోలందరితోను తాను మంచి రిలేషన్ మెయిన్ టెన్ చేస్తూ ఉంటానని తాజా ఇంటర్వ్యూలో కృష్ణవంశీ చెప్పారు. ఇక ఆ హీరోలంతా కూడా కుదరకపోతే ఫోన్ చేస్తూ ఉంటారనీ .. కుదిరితే తనని కలుస్తూ ఉంటారని చెప్పారు. ఒక్కోసారి కారు పంపిస్తే తాను వెళుతూ ఉంటానని .. మళ్లీ ఓ సినిమా చేద్దామని వాళ్లు అడుగుతూ ఉంటారని అన్నారు. కృష్ణవంశీ మంచి మనసుకు .. ఆయనపై స్టార్ హీరోలకున్న నమ్మకానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? 
Go Back to Shorts
krishnavamsi

More Telugu News