vijay devarakonda: విజయ్ దేవరకొండ కనిపించనున్నది ఎన్టీఆర్ గానా? ఏఎన్నార్ గానా?

దర్శకుడు నాగ్ అశ్విన్ 'మహానటి' పేరుతో సావిత్రి జీవిత చరిత్రను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. సావిత్రి పాత్రను కీర్తి సురేశ్ చేస్తుండగా... ఆమె భర్త జెమినీ గణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటిస్తున్నాడు. మరో కీలకమైన పాత్రలో సమంతా నటిస్తోంది. ఇక ఎన్టీఆర్, ఏఎన్నార్ పాత్రలను జూనియర్ ఎన్టీఆర్, నాగచైతన్యలతో చేయించాలనుకున్నారుగాని కుదరలేదు.
 
దాంతో విజయ్ దేవరకొండను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఆయన ఎన్టీఆర్ పాత్రలో కనిపించనున్నాడా? ఏఎన్నార్ పాత్రను పోషించనున్నాడా? అనే విషయంలో క్లారిటీ రావలసి వుంది. గతంలో నాగ్ అశ్విన్ తెరకెక్కించిన 'ఎవడే సుబ్రమణ్యం' సినిమాలో విజయ్ దేవరకొండ చేశాడు. ఆ పరిచయంతోనే ఆయనని నాగ్ అశ్విన్ తీసుకున్నాడని అంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు దశలో వుంది.      
vijay devarakonda

More Telugu News