vikram: మరో విభిన్నమైన పాత్రకి సిద్ధమవుతోన్న విక్రమ్!

మొదటి నుంచి కూడా విక్రమ్ ప్రయోగాత్మక కథలకి ప్రాధాన్యతనిస్తూ .. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. ఈ మధ్య ఆయన సినిమాల చిత్రీకరణకి ఎక్కువ సమయాన్ని కేటాయించకుండా చకచకా చేసుకుపోతున్నారు. అలా ప్రస్తుతం ఆయన 'స్కెచ్' .. 'సామి 2' సినిమాలు చేస్తున్నారు.

ఈ సినిమాలు పూర్తికాగానే ఆయన కె.వి. ఆనంద్ తో ఓ ప్రాజెక్టు చేయనున్నట్టు సమాచారం. తమిళంలో 'రంగం' .. 'బ్రదర్స్' .. 'అనేగన్' సినిమాల ద్వారా దర్శకుడిగా ఆయన తన సత్తా చాటుకున్నారు. అలాంటి ఆయన వినిపించిన ఒక కథ నచ్చడంతో వెంటనే విక్రమ్ ఓకే చెప్పేశాడట. ఇది ప్రయోగంతో కూడిన సందేశాత్మక చిత్రమే అయినా, ఆరు నెలలలో పూర్తి చేయాలని విక్రమ్ ముందుగానే చెప్పారట. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి
vikram

More Telugu News