mohan lal: సగం మనిషి .. సగం మృగం పాత్రలో మోహన్ లాల్!

మోహన్ లాల్ ఒక సినిమాను అంగీకరించారంటే .. ఆ కథలో ఏదో కొత్తదనం ఉంటుందనే విషయం ప్రేక్షకులకు తెలుసు. అందువల్లనే ఆయన సినిమా వచ్చిందంటే చాలు.. థియేటర్ల దగ్గర పెద్ద ఎత్తున సందడి కనిపిస్తుంది. తనదైన తరహాలోనే ఈ సారి కూడా ఆయన ఒక విభిన్నమైన కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

 ఈ సినిమాకి 'ఒడియన్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. చిత్ర దర్శకుడు శ్రీకుమార్ మీనన్ మాట్లాడుతూ .. ఈ సినిమాలో మోహన్ లాల్ సగం మనిషి .. సగం మృగంగా కనిపిస్తాడని చెప్పారు. ఇది చరిత్ర .. జానపదం కలగలిసిన ఒక వింత కథ అని అన్నారు. మలయాళంలో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన చిత్రాల సరసన ఇది చేరుతుందని చెప్పారు. మోహన్ లాల్ కెరియర్లో ఈ సినిమా ప్రత్యేక స్థానాన్ని దక్కించుకోవడం ఖాయమని అన్నారు.   
mohan lal

More Telugu News