vijayendra prasad: తమిళ దర్శకుడు శంకర్ సినిమాకి కథపై విజయేంద్ర ప్రసాద్ కామెంట్!

భారీ చిత్రాలను తెరకెక్కించడం .. భారీ సక్సెస్ లను అందుకోవడం సౌత్ లో ఒక్క శంకర్ కి మాత్రమే సాధ్యమని అనుకునే వాళ్లు. అలాంటిది ఆ స్థాయిని దాటి రాజమౌళి సౌత్ సినిమాను మరింత ఎత్తుకు తీసుకెళ్లాడు. ఇలాంటి పరిస్థితుల్లో కథ రెడీ చేయమని శంకర్ అడిగితే ఏం చేస్తారనే ప్రశ్న విజయేంద్ర ప్రసాద్ కి ఎదురైంది.

 అదేం ప్రశ్న .. ఆయన కథ అడగడం కాదు .. అవసరమైతే నేనే కథ రెడీ చేసి సినిమా చేయమని శంకర్ ను కోరతానని విజయేంద్ర ప్రసాద్ సమాధానమిచ్చారు. అలా ఆయన దర్శకుడు శంకర్ పై తనకి గల అభిమానాన్ని చాటుకున్నారు. గతంలో శంకర్ తమిళంలో చేసిన 'ముదలవన్' సినిమా తెలుగులో 'ఒకే ఒక్కడు' పేరుతో రాగా, హిందీలో 'నాయక్' పేరుతో హిట్ కొట్టింది. ఇప్పుడు హిందీ సీక్వెల్ కి విజయేంద్ర ప్రసాద్ పనిచేస్తున్నారు. ఇక తెలుగులో విజయాన్ని సాధించిన 'విక్రమార్కుడు' కూడా హిందీలో ' రౌడీ రాథోడ్' పేరుతో సక్సెస్ ను సాధించింది. ఈ సినిమా సీక్వెల్ పనిలోను విజయేంద్ర ప్రసాద్ బిజీగా వున్నారు.   
vijayendra prasad

More Telugu News