krishnavamsi: 'రైతు' కోసం కృష్ణవంశీకి బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేనా?

షార్ట్స్‌లో చూడండి
'పైసా వసూల్'తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న బాలకృష్ణ, ఆ తరువాత కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా తరువాత ఆయన కృష్ణవంశీ దర్శకత్వంలో 'రైతు' సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందా? అనే విషయంపై ఫిల్మ్ నగర్లో చర్చలు జరుగుతున్నాయి.

 కృష్ణవంశీ కూడా 'నక్షత్రం' మూవీకి సంబంధించిన పనులను దాదాపు పూర్తి చేసేశాడు మరి. 'రైతు' సినిమా గురించి ఈ మధ్య కాలంలో బాలకృష్ణ ఎక్కడా ప్రస్తావించలేదు. అందువలన ఆయన ఈ సినిమా చేస్తారా అనేది డౌటే. అయితే ఇది సమాజానికి ఎంతో ఉపయోగపడే కథ అనీ .. దీనిని తప్పకుండా తెరకెక్కిస్తానని కృష్ణవంశీ అంటున్నాడు. బాలయ్యనే ఒప్పిస్తాడో .. మరో హీరోనే వెతుక్కుంటాడో చూడాలి మరి.
Go Back to Shorts
krishnavamsi

More Telugu News